చిరుత దాడుల నుంచి అడ్డుకోవాలంటే అడవుల్లోకి మేకలను వదలండి : మహా మంత్రి
ఆహారం కోసం జనావాసాల్లోకి చిరుత పులులు ప్రవేసించి, ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఈ తరహా దాడులను అడ్డుకోవాలంటే అడవుల్లోకి మేకలను వదలాలని మహారాష్ట్ర మంత్రి గణేశ్ నాయక్ అన్నారు. ఇటీవలికాలంలో మహారాష్ట్రలో చిరుత పులులదాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిపై విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి గణేశ్ నాయక్ ఓ ఐడియా ఇచ్చారు.
చిరుత పులులు జనవాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే భారీ సంఖ్యలో మేకలను అడవుల్లోకి వదిలిపెట్టాలని ఆయన సూచించారు. చిరుత పులుల దాడుల్లో బాధితులు చనిపోయిన తర్వాత పరిహారం ఇవ్వడం కంటే.. ఆ డబ్బుతోనే మేకలను కొనుగోలు చేసి అడవిలోకి వదిలివేయాలని కోరారు. ఈ మేరకు ఆయన అధికారులకు సూచించారు.
ఒక వేళ చిరుత పులుల దాడిలో నలుగురు మరణిస్తే పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను చెల్లించాలి. అందుకే మరణాల తర్వాత పరిహారం అందించే బదులు, ఆ రూ.కోటి విలువైన మేకలను అడవుల్లోకి వదిలితో చిరుతలు జనవాసాల్లోకి రాకుండా ఉంటాయి అని వ్యాఖ్యానించారు.
చిరుతల ప్రవర్తన, వాటి జీవిన విధానాలు మారిపోయాయన్నారు. ఒకపుడు అడవి జంతువులుగా పేర్కొన్నప్పటికీ ఇపుడు వాటి ఆవాసం చెరకు తోటలకు మారిపోయిందన్నారు. అహల్యానగర్, పూమె, నాసిక్ జిల్లాల్లో చిరుత దాడులు ఇటీవల భారీగా పెరిగాయని మంత్రి తెలిపారు.