శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 5 ఫిబ్రవరి 2026 (14:21 IST)

చెత్తలో బంగారం: పారిశుద్ధ్య కార్మికురాలిని ప్రపంచ సుందరి అంటూ నటుడు పార్థీబన్

Actor Parthiban calls a sanitation worker a world beauty
ఆమెకి చెత్తలో బంగారం దొరికింది. బంగారం దొరికితే గబుక్కున దాచేసుకుంటారు. కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు తనకు దొరికిన బంగారాన్ని ఎంతో జాగ్రత్తగా అధికారులకు అందజేసింది. ఆ బంగారం ఎవరిదో విచారించి వారికి అందజేయడంతో ఆ పారిశుద్ధ్య కార్మికురాలు పెద్దమనసుకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
 
అంత మంచిమనసు వున్న పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను నటుడు పార్థిబన్ ఘనంగా సత్కరించారు. ఈమె ప్రపంచ సుందరి అంటూ కిరీటంతో అలంకరించి సత్కరించారు. చెన్నైలో ఎథిరాజ్ కళాశాలలో ఇది జరిగింది. కాగా పద్మ యొక్క వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.