శుక్రవారం, 23 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2025 (22:29 IST)

3 కోట్ల ఐఆర్‌సీటీసీ ఖాతాలు డీయాక్టివేట్ చేసిన రైల్వే శాఖ

irctc
దేశ వ్యాప్తంగా 3.2 కోట్ల ఐఆర్‌సీటీసీ ఖాతాలను రైల్వేశాఖ డీయాక్టివేట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖామంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. తత్కాల్ టిక్కెట్ల జారీ విషయంలో ఇటీవల అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం ఐఆర్సీటీసీ ఖాతాలే ఏరివేతనూ అదేస్థాయిలో చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ యేడాదిలో జనవరి నుంచి ఇప్పటివరకు 3.02 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్టు మంత్రి వెల్లడించారు. 
 
ఏకమాయ్ (ఏకేఏఎంఏఐ) వంటి యాంటీ బాట్ టెక్నాలజీని వినియోగించి నకిలీ, ఆటోమేటెడ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు లోక్‌‍సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
సామాన్యులకు సాధారణ, తత్కాల్ టిక్కెట్లు అందేలా రిజర్వేషన్ వ్యవస్థ తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. తత్కాల్ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఆధార్ బేస్డ్ ఓటీపీ వ్యవస్థను దశలవారీగా అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం 322 రైళ్లకు దీన్ని వర్తింపజేశామన్నారు. దీనిద్వారా ఆయా రైళ్లలో తత్కాల్ టిక్కెట్లు అందుబాటు సమయం దాదాపు 65 శాతం మేరకు పెరిగిందని ఆయన వెల్లడించారు. అలాగే, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కూడా తత్కాల్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ వెరిఫికేషన్‌ విధానాన్ని డిసెంబరు 4 వరు 211 రైళ్లకు వర్తింపజేసినట్టు తెలిపారు.