శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 నవంబరు 2015 (19:13 IST)

బీహార్ ఫలితాలు : మహాకూటమి.. గ్రాండ్ విక్టరీ... సీఎం పీఠంపై మళ్లీ నితీశ్ కుమారే

నరాలు తెగే ఉత్కంఠతకు తెరపడింది. దేశవ్యాప్తంగా అతృతతో ఎదురు చూసిన బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఏ ఒక్కరూ ఊహించినట్టుగా ఈ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించింది. పలు మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌కు భిన్నంగా గ్రాండ్ అలయన్స్.. గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో నితీశ్ కుమార్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. 
 
మొత్తం 243 స్థానాలకు గాను మహాకూటమి 178 సీట్లలో విజయభేరీ మోగించింది. అలాగే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేవలం 57 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ బీహార్‌లోని 33 జిల్లాల్లో ఏకంగా 13 జిల్లాల్లోఖాతానే తెరవలేక పోయింది. బక్సార్, బెగుసరాయ్, కిషన్ గంజ్, మాదేపురా, ముంగేర్, సమస్తీపూర్, షేక్ పురా, అరావల్, భోజ్ పూర్, శివోర్, జెహనాబాద్, ఖగాడియా, సహర్ష జిల్లాల్లో కమలం పూర్తిగా వాడిపోయింది. 
 
ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలిచిన సీట్లను పరిశీలిస్తే... మహా కూటమి 178 సీట్లు. ఇందులో జేడీయు 71, ఆర్జేడీ 80, కాంగ్రెస్ 27 చొప్పున సీట్లను గెలుచుకున్నాయి. అలాగే, ఎన్డీయే కూటమికి 58 సీట్లు దక్కాయి. ఇందులో బీజేపీ 52, ఎల్జేపీ 2, ఆర్ఎల్ఎస్పీ 1, హెచ్ఏఎం 1 చొప్పున గెలుచుకోగా, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు.