శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2016 (16:20 IST)

అప్పగింతల సమయంలో వరుడికి గుండెపోటు.. కన్నుమూత... ఎక్కడ

పెళ్లంటే నూరేళ్ల పంటని పెద్దలు అంటుంటారు. పెళ్ళనగానే ఇళ్లంతా పచ్చటి తోరణాలు, బంధువులు అంతా సందడి సందడిగా ఉంటుంది. కర్ణాటక బళ్లారి జిల్లాలోని కొట్టూరు ఓ ఇంట్లో పెళ్లి తంతు జరుగుతోంది. బాజాభజంత్రీల మధ్య ఎటువంటి ఆటంకాలు లేకుండా పెద్దల సమక్షంలో పెండ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టాడు. పెళ్లి శుభంగా జరిగింది. అందరూ విందు భోజనాలు కడుపార ఆరగించి దంపతులను దీవించి వెళ్లిపోయారు. 
 
అలా వెళ్ళిన కొంతసేపటికే పెళ్లింట్లో దారుణం జరిగిపోయింది. కొట్టూరుకు చెందిన కొట్రేష్‌కు అక్క కూతురితో వివాహం జరిగింది. పెళ్లితంతు ముగిసిన తర్వాత అప్పగింతల కార్యక్రమం జరుగుతోంది. అంతలోనే కొట్రేష్‌కు గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోపే పెళ్లి మంటపంలో కన్నుమూశాడు. దీంతో పెళ్లివారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లికోసం కట్టిన పచ్చటితోరణాలు వాడకముందే నిండు జీవితం అర్థాతరంగా ముగిసిపోయింది.