1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Gujarat : The mother was living in a live-in relationship, and the daughters were brutally abused for month

గుజరాత్‌లో దారుణం : ఇద్దరు మైనర్ బాలికలు గర్భం - చోద్యం చూసిన తల్లి

minor girl pregnancy
గుజరాత్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు ఇద్దరు మైనర్ బాలికలను గర్భవతులను చేశాడు. ఈ విషయం తెలుసుకున్న కన్నతల్లి మౌనం వహించి, చోద్యం చూస్తుండిపోయింది. ఈ కేసులో పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. 
 
గుజరాత్‌లో ఓ కీచకుడు ఇద్దరు మైనర్ సవతి కుమార్తెలపై (12 యేళ్ల, 13 యేళ్లు) గత కొన్నేళ్లుగా అడవికి తీసుకెళ్లి, బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. చిన్న కుమార్తెకు కడుపునొప్పిరావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది. భయంతో పెద్ద కుమార్తె అసలు నిజం చెప్పడంతో ఆమెకు కూడా పరీక్షలు చేయించగా 2 నెలలుగా గర్భవతి అని తేలింది. 
 
పెద్ద కుమార్తెకు జన్మించిన శిశువును ఓ కజిన్ విక్రయించినట్టు సమాచారం. ఈ ఘోరం అంతా తెలిసినా తల్లి మౌనంగానే ఉండిపోయింది. నవసారి జిల్లా పోలీసులు తక్షణమే తక్షణమే స్పందించి, నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి విచారణ జరుపుతోంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వెస్ట్ బెంగాల్ : నిన్న అభిషేక్ బెనర్జీ నేడు కళ్యాణ్ బెనర్జీపై దాడి...