పోలీస్ అడిగాడని లిఫ్ట్ ఇస్తే రూ.20 వేలు కాజేశాడు...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పిచడంతో పాటు దోపిడీలు, చోరీలను అరికట్టాల్సిన పోలీసే దొంగగా మారిపోయాడు. పోలీస్ కదా అని లిఫ్ట్ ఇస్తే ఏకంగా రూ.20 వేలు కాజేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ సర్కారు పాలన ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్‌పూర్‌లో ఓ పోలీస్ అధికారి లిఫ్ట్ అడిగి, తనను టోల్ ప్లాజా వద్ద డ్రాప్ చేయమని కోరాడు. దీంతో ఆ ట్రక్ డ్రైవర్.. పోలీస్‌కు లిఫ్ట్ ఇచ్చాడు. టోల్ ప్లాజా వద్ద దిగగానే.. పోలీస్ అధికారి కారులో వెళ్లిపోయాడు.
ఇంతలో తన వద్ద రూ.20 వేలు మాయం అయ్యాయని గుర్తించిన ట్రక్ డ్రైవర్... 10 కిలోమీటర్ల దూరం అధికారిని వెంబడించి చివరకు ఓ చోట అతడ్ని పట్టుకుని తన రూ.20 వేలు ఎక్కడ అని నిలదీశాడు. అయితే, తన ఖాకీ పవర్‌తో బెదిరించేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ట్రక్ డ్రైవర్ ఏమాత్రం బెదరకుండా ఎదురొడ్డి తన వద్ద కాజేసిన రూ.20 వేలు రికవరీ చేసుకున్నాడు. ఇంతలో పాదాచారులంతా గుమి కూడి పోలీస్ అధికారికు తగిన బుద్ధి చెప్పారు. దీంతో పోలీస్ అధికారి తలదించుకుని వెళ్లిపోయాడు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి, చోరీకి పాల్పడిన పోలీస్ అధికారిపై సస్పెండ్ వేటు వేశారు. అలాగే, అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
పోలీసోడు కదా అని లిఫ్ట్ ఇస్తే.. రూ.20 వేలు కాజేశాడు
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 7, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఘటన
టోల్ ప్లాజా వద్ద డ్రాప్ చేయమని.. ట్రక్ డ్రైవర్‌కు లిఫ్ట్ అడిగిన ఓ సబ్-ఇన్స్పెక్టర్
టోల్ ప్లాజా వద్ద దిగిన అనంతరం తన వ్యక్తిగత కారులో వెళ్లిన అధికారి
ఇంతలో.. తన… pic.twitter.com/eyCiS4sEA7
