శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2015 (11:14 IST)

హార్దిక్ పటేల్‌పై రాజద్రోహం కేసు.. అరెస్టు చేసిన రాజ్‌కోట్ పోలీసులు

త్రివర్ణ జాతీయ పతాకాన్ని అవమానించాడనే అభియోగంపై పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌పై రాజ్‌కోట్ పోలీసులు రాజద్రోహం అరెస్టు చేశారు. పోలీసులను చంపాలని యువకులను రెచ్చగొట్టినందుకు ఆయనపై రాజద్రోహం కేసు కూడా నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
భారత - దక్షిణాఫ్రికాల మధ్య రాజ్‌కోట్‌లో జరిగే వన్డే క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకుంటామని ప్రకటించిన హార్దిక్ అందుకోసం ఖాందేరీ స్టేడియానికి వెళ్తుండగా రాజ్‌కోట్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా హార్దిక్ జాతీయ పతాకం పట్టుకుని కారుపై నుంచి కిందకి దునికినపుడు తన కాలితో జెండాను తొక్కినట్లు గుర్తించారు. 
 
సంబంధిత వీడియో ఫుటేజీ మొత్తం చెక్ చేశాం. ఆయన జాతీయ పతాకాన్ని అవమాన పరిచి నేరానికి పాల్పడినట్లు స్పష్టమైంది. ఈ మేరకు పద్దారీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హార్దిక్‌ను అరెస్ట్ చేశాం అని రాజ్‌కోట్ రూరల్ ఎస్పీ గగన్‌దీప్ గంభీర్ తెలిపారు.