హార్దిక్ పటేల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ: జనవరి 5వరకు రిమాండ్

hardik patel
Selvi| Last Updated: శుక్రవారం, 6 నవంబరు 2015 (16:34 IST)
సుప్రీం కోర్టులో పటేళ్ల రిజర్వేషన్ పోరాట నాయకుడు హార్దిక్ పటేల్‌కు నిరాశ ఎదురైంది. అతనిపై నమోదైన రాజద్రోహం కేసును శుక్రవారం విచారించిన కోర్టు వచ్చే ఏడాది జనవరి 5వరకు రిమాండ్ విధించింది. భారత్, దక్షిణాఫ్రికాల జట్ల మధ్య వన్డే మ్యాచ్ సందర్భంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో హార్దిక్ మాట్లాడుతూ.. అవసరమైతే పోలీసులను కూడా చంపాలంటూ పిలుపునిచ్చాడు. దీంతో అతనిపై రాజద్రోహం కేసును పోలీసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఈ మేరకు హార్దిక్ పటేల్‌‌పై నమోదైన రాజద్రోహం కేసులో హార్దిక్‌పై విచారణ కొనసాగాల్సిందేనని ఆదేశించింది. అయితే ఈ కేసులో తదుపరి విచారణ జరిగే జనవరి 5 వరకు అతనిపై చార్జ్ షీట్ నమోదు చేయవద్దని గుజరాత్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాగా అక్టోబర్ 19వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :