మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 12 మే 2016 (11:09 IST)

ప్రధాని మోడీని కలుస్తా... కేంద్ర సాయం లేకుండా మనుగడ సాగించలేం : హరీశ్ రావత్

ఉత్తరాఖండ్ శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గడం ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని న్యాయవ్యవస్థ పునరుద్ధరించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అన్నారు. ఈ పోరాటంలో తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌తోపాటు ఇతర కాంగ్రెస్ నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. 
 
మొత్తం 70 శాసనసభ్యులు కలిగిన అసెంబ్లీల స్పీకర్ అనర్హులుగా 9 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. మిగిలిన 61 మంది విశ్వాస పరీక్షలో పాల్గొనగా, హరీశ్ రావత్‌కు 33 మంది, బీజేపీకి అనుకూలంగా 28 మంది ఓటు వేశారు. దీంతో హరీశ్ రావత్ గెలుపొందడంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... భవిష్యత్తులో ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమన్నారు. ఇందుకోసం తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలుస్తానని చెప్పారు. పాత అనుభవాలను మరిచిపోయి కొత్తగా ముందుకుపోవాల్సి ఉంటుందని అన్నారు.