కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసిన అస్సాం సీఎం
కాంగ్రెస్ నేతలపై నుంచి రూ.500 కోట్లకు అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ పరువు నష్టం దావా వేశారు. తనకు, తన కుటుంబం పరువుకు భంగం కలిగించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడారని ఆయన ఆరోపించారు.
అస్సాం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అస్సోం సీఎం హిమంతా బిశ్వా శర్మ, ఆయన కుటుంబ సభ్యులు 1200 ఎకరాల భూములను ఆక్రమించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేతలైన జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గగోయ్‌లపై హమంత రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేసినట్టు వెల్లడించారు. దనపై దురుద్దేశపూర్వకంగా, పరువుకు భంగం కలిగించేలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. వారి నుంచి రూ.500 కోట్ల పరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేశానని ఆయన వెల్లడించారు. ఈ దావా కేసు అస్సాం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.