భార్యను బూతులు తిట్టిన మహిళను చెప్పుతో కొట్టిన భర్త, వీడియో
కొంతమంది భార్యలు అనుకునేది ఏమిటంటే... తనను ఎవరైనా తిడుతుంటే తన భర్త హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు నాపైన అంత కోపం వుంటుంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ వాళ్లాయన మాత్రం అట్లాంటివాడు కాదు. తన భార్యను మరో స్త్రీ బూతులు తిడుతుంటే సహించలేని అతడు సదరు మహిళపై చెప్పు తీసుకుని దాడి చేయడం ప్రారంభించాడు. వాస్తవానికి మహిళపై దాడి చేయడం సమంజసం కాదు. అసలు ఏం జరిగిందంటే...
రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో సీటు గురించి ఓ మహిళ మరో మహిళతో వాగ్వాదానికి దిగింది. ఇది కాస్తా తీవ్రరూపం దాల్చి దుర్భాషను ప్రయోగించే స్థాయికి వెళ్లిపోయింది. తన భార్యను పరాయి మహిళ అలా దుర్భాషలాడటాన్ని సహించలేని భర్త... వెంటనే చెప్పు తీసుకుని మహిళపై దాడి చేసాడు. తోటి ప్రయాణికులు అడ్డుపడుతున్నా వదిలిపెట్టలేదు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందన్నది తెలియరాలేదు.