1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Husband Sells Assets to Secure Government Job for Wife: She Runs Away with Her Lover

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

Husband and wife
తన భార్య ఆమె ప్రియుడితో ఏకాంతంగా గడపడాన్ని కట్టుకున్న భర్త చూసి షాక్ తిన్నాడు. ఆమెను నిలదీశాడు. అందుకు ఆమె ఎంతమాత్రమూ పశ్చాత్తాపం చెందకుండా... మా ఇద్దర్నీ కలిసి వుండటం చూసావు కదా, నీతో కలిసి కాపురం చేయడం నాకిష్టం లేదు. నేను నా ప్రియుడితోనే వుంటాను అని పదేళ్ల కొడుకుని, భర్తను వదిలేసి వచ్చిన భార్య అలా సమాధానం చెప్పింది. దీనితో భర్త తన భార్య కోసం తను ఎంత కష్టపడిన విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
బీహారు రాష్ట్రంలో హాజీపూర్‌లో అమన్ కుమార్, గుంజన్ కుమారి నివాసం వుంటున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు వున్నాడు. ఐతే భార్యకు ఎలాగైనా ఉద్యోగస్తురాల్ని చేయాలన్న పట్టుదలతో అమన్ కుమార్ తన వ్యవసాయ భూమిని అమ్మేసాడు. ఆ డబ్బుతో భార్య గుంజన్ కి బీపీఎస్సీ కోచింగ్ ఇప్పించాడు. ఆమెకి ఇంటి పనులేమీ చెప్పకుండా అన్నీ తనే చూసుకుంటూ ఆమె చదువుపై ధ్యాస పెట్టేందుకు సహకరించాడు. అనుకున్నట్లుగానే బీపీఎస్సీ పరీక్షలో గుంజన్ అర్హత సాధించింది. ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చాక ఆమె ప్రవర్తనలో కూడా క్రమేణా మార్పు వచ్చింది.
 
భర్తతో సమయం గడపడాన్ని తగ్గించేసింది. ఉద్యోగం వచ్చిన సందర్భంగా తన స్నేహితురాండ్లతో కలిసి పార్టీ చేసుకుంటున్నామనీ, అంతా కలిసి డార్జిలింగ్ వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఐతే అలా వెళ్లిన గుంజన్ ఎంతకీ ఫోన్ చేయకపోగా, భర్త ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం మానేసింది. ఆ తర్వాత 10 రోజులకు గుంజన్ ఇంటికి తిరిగి వచ్చింది. ఎందుకలా చేసావ్, ఎక్కడికెళ్లావంటూ భర్త గట్టిగా నిలదీయడంతో అతడితో గొడవపడింది. విషయాన్ని తన మేనమామ దృష్టికి తీసుకుని వెళ్లాడు.
 
ఇంతలో గుంజన్ ఆమె ప్రియుడు ప్రేమ్ ప్రకాష్‌తో సన్నిహితంగా వుండటాన్ని గమనించి వారిని వెంబడించాడు. వారిద్దరూ ప్రియుడి ఇంట్లో ఏకాంతంగా గడపడాన్ని కళ్లారా చూసాడు. ఇదే విషయాన్ని మేనమామకి చెప్పగా... ఆమె నీతో వుండాలనుకోవడంలేదు. ఇప్పుడు ఏం చేద్దాం... వదిలేసెయ్ అంటూ చాలా తేలికగా సమాధానమిచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేసాడు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని, తన భార్యను ప్రయోజకరాలిని చేసినందుకు నాకు దక్కిన బహుమతి ఇదా అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. తన భార్య గుంజన్ తో తను ఇక కలిసి జీవించే ప్రసక్తే లేదనీ, తమకు విడాకులు మంజూరు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేసాడు.
 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)