1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. I Am the CM, You Are the Ministers: TVK Vijay to MLA Candidates

నేనే సీఎం, మీరే మంత్రులు: ఎమ్మెల్యే అభ్యర్థులతో టీవీకె విజయ్

TVK Vijay
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. నటుడు విజయ్ టీవీకే పార్టీకి 20 నుంచి 25 మధ్య స్థానాలు రావచ్చునని చాలామటుకు సర్వేలు తేల్చాయి. ఐతే టీవీకే చీఫ్ విజయ్ మాత్రం తన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో వేరేగా చెప్పేస్తున్నారట. తమిళనాడులో ఎన్నాళ్లగానో పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే మన దెబ్బకి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని అని చెప్పేసారట.
 
మే 4న మనమే గెలవబోతున్నాము. నేనే సీఎం కాబోతున్నాను. మీరు మంత్రులు. ముఖ్యంగా చెప్పేదేమిటంటే... గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లవద్దు. సంబరాలు అంటూ మీ నియోజకవర్గాలకు సైతం వెళ్లొద్దు. అందరూ మన కేంద్ర కార్యాలయానికి రావాలి. మీకోసం నేను ఎదురుచూస్తుంటాను. క్యాంపు రాజకీయాల జోలికి వెళ్లవద్దు. వెళ్లినట్లు తెలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని సూటిగా హెచ్చరించారట.
 
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడిన మహిళ