పురుష శవాల ప్రైవేట్ భాగాలపై అనుకోకుండా అలా అనేసాను: లేడీ వైద్య విద్యార్థిని సెజల్ పవార్ క్షమాపణలు
స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోర్ కామెడీ షోలో లేడీ వైద్య విద్యార్థిని సెజల్ పవార్ (Sejal Pawar) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ముంబై లోని కింగ్ ఎడ్వెర్డ్ మెమోరియల్ (KEM) ఆసుపత్రి తీవ్రంగా ఖండించింది. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని పేర్కొంది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం విచారణను ప్రారంభించింది. శుక్రవారం ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకనట విడుదల చేస్తూ, వైద్య విద్యార్థిని సెజల్ పవార్ చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదుల నేపధ్యంలో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది. ఈ కమిటీ కామెడీ షోలో సెజల్ ఏం మాట్లాడారన్న దానిని పూర్తిగా పరిశీలించిన మీదట తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మరోవైపు వైద్య విద్యార్థిని వ్యాఖ్యలను పరిశీలించిన అనంతరం సీఎం ఫడ్నవిస్ స్పందిస్తూ... నోటికి వచ్చిందల్లా మాట్లాడేసి, అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసి అది తమ భావ స్వేచ్ఛ అంటే వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
THE CURSE OF RESERVATION
— The Story Teller (@IamTheStory__) June 11, 2026
Now Sejal Pawar is doubling down on her previous antics by issuing a VICTIM CARD apology.
She has secured a MBBS seat using the reservation quota when she is not eligible for the one and coming from an affluent family. pic.twitter.com/YCSWBjJw5L
అసలు వివాదం ఏమిటి?
మహిళా వైద్య విద్యార్థిని సెజల్ పవార్ కామెడీ షోలో పాల్గొన్నారు. ఆమె పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేశారు. ఇది వైద్య నైతికతను ఉల్లంఘించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరహా కామెంట్స్ వైద్య నైతికతను ఉల్లఘించారంటూ విమర్శలు వచ్చాయి. ఇది పెద్ద వివాదం కావడంతో సారీ చెబుతూ వీడియో విడుదల చేశారు. వైద్య శిక్షణ కోసం ఉపయోగించే మృతదేహాలపై ఆమె అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, వైద్య వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో చివరకు ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
ముంబైలోని ప్రసిద్ధ కేఈఎం ఆస్పత్రి నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ సెజల్ పవార్ ఇటీవల స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోర్ నిర్వహించిన షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమెడియన్ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ, అనాటమీ క్లాసుల్లో పురుషుల మృతదేహాలను చూసినపుడు తమ స్నేహితురాళ్లతో కలిసి వాటి ప్రైవేట్ భాగాల గురించి సరదాగా మాట్లాడుకునేవాళ్లమని, వాటి పరిణామాలు పోల్చి చూసేవాళ్లమని నవ్వుతూ చెప్పారు.
ఈ క్లిప్ సోషల్ మీడియాలో వ్యాపించడంతో డాక్టర్ సెజల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వైద్యం కోసం తమ శరీరాలను దానం చేసిన వారి పట్ల కనీస గౌరవం లేకుండా మాట్లాడటం వైద్య నైతికతకు విరుద్దమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థులు మృతదేహాన్ని తాకే ముందు చేసే కడావరిక్ ఓత్(శవపరీక్ష ప్రమాణం)ను ఆమె అవమానించారని మండిపడ్డారు.
వివాదం ముదరడంతో డాక్టర్ సెజల్ పవార్ ఇన్‌స్టా ద్వారా క్షమాపణలు తెలిపారు. ఆ షోలో నేను చాలా అమాయకంగా, ఆలోచించకుండా మాట్లాడాను. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టివుంటే క్షమించండి. నేను చేసిన తప్పుకు పూర్తి బాధ్యత వహిస్తున్నాను. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాటు పునరావృతం కాదు అని ఆమె పేర్కొన్నారు.
