గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 జనవరి 2026 (19:17 IST)

బెంగళూరులో బోయ్స్ వేషంలో వచ్చి ఇళ్లను దోచుకుంటున్న గర్ల్స్

girls robbing houses
సహజంగా దొంగలు అంటే పురుషులే వుంటుంటారు. కానీ ట్రెండ్ మారింది. ఈ నేరంలో మహిళలు కూడా చేరిపోతున్నారు. తాజాగా బెంగళూరులో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకున్నది. బెంగళూరులోని సింపిగేహళ్లి ప్రాంతంలో షాలు, నీలు అనే ఇద్దరమ్మాయిలు అబ్బాయిల వేషాలు వేసుకుని దొంగతనాలు చేయడం కలకలం సృష్టిస్తోంది. వీరు తొలుత స్కూటీ వేసుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏ ఇంటికి తాళం వేసి వున్నదో రెక్కీ నిర్వహించేవారు.
 
అలా ఏ ఇల్లు తాళం వేసి వుంది, ఏది దొంగతనానికి వీలవుతుందో తెలుసుకుని ఆ ఇల్లు ఎంపిక చేసుకునేవారు. ఆ తర్వాత అబ్బాయిల వేషాలు ధరించి స్కూటీ వేసుకుని వచ్చేస్తారు. అలాగే జనవరి 13న ఓ ఆటోడ్రైవర్ ఫ్యామిలీ ఇంటికి తాళం వేసి బైటకు వెళ్లడాన్ని ఈ ఇద్దరు గమనించారు. వాళ్లలా వెళ్లగానే ఇద్దరూ ఎంట్రీ అయిపోయారు.
 
తాళం పగలగొట్టి ఇంట్లో నగదు, విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యారు. ఐతే రోడ్డుపై అమర్చిని సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. దొంగతనం చేసింది తొలుత అబ్బాయిలే అనుకున్నారు, కానీ వారు అమ్మాయిలు అని తెలుసుకుని పోలీసులు కూడా షాకయ్యారు.