గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (13:24 IST)

బైకుతో రోడ్డు దాటాడు.. వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టేసింది.. గాల్లోకి ఎగిరిపోయాడు.. ఆపై..? (Video)

రోడ్డు ప్రమాదాలకు అతివేగం, ఆదమరుపు, మద్యం సేవించి బండి నడపడం ప్రధాన కారణాలవుతున్నాయి. కారో, బైకో చేతులో ఉంటే.. ఇక అతివేగంగా కొందరు రెచ్చిపోతున్నారు. గాల్లో తేలిపోతున్నట్లు బండ్లను నడుపుతున్నారు. ఈ అతి

రోడ్డు ప్రమాదాలకు అతివేగం, ఆదమరుపు, మద్యం సేవించి బండి నడపడం ప్రధాన కారణాలవుతున్నాయి. కారో, బైకో చేతులో ఉంటే.. ఇక అతివేగంగా కొందరు రెచ్చిపోతున్నారు. గాల్లో తేలిపోతున్నట్లు బండ్లను నడుపుతున్నారు. ఈ అతివేగమే ఓ వ్యక్తి ప్రాణాల్ని తీసింది. కేరళలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసినవారంతా ఎంత దారుణం జరిగిపోయిందని బాధపడుతూ.. కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే? కేరళలోని వయనంద్ జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోరం కాస్త సీసీ ఫుటేజ్‌లో రికార్డైంది. స్కూటర్‌పై ఓ వ్యక్తి  రోడ్డు దాటుతుండగా ఎక్కడి నుంచో వేగంగా వచ్చిన కారు బైకును ఢీ కొట్టింది. కారు వేగానికి స్కూటర్‌తో పాటు వ్యక్తి కూడా గాల్లోకి తేలిపోయాడు.
 
పది అడుగుల ఎత్తువరకు పైకెగిరి 20 మీటర్ల దూరంలో కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సదరు బైకు నడిపిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతివేగం ప్రమాదకరమని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఇలాంటి కొందరి నిర్లక్ష్యం వల్ల అమాయక ప్రజలు విగతజీవులుగా మారుతున్నారు. ఈ వీడియో చూసినవారంతా బైకు వ్యక్తి ఒక్క క్షణం ఆగివుంటే ప్రమాదం జరిగివుండేది కాదని.. ఆదమరిచి రోడ్డు దాటుతుండగా కారు వేగంతో ఢీ కొట్టేయడం దారుణమంటున్నారు.