గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2015 (16:44 IST)

భారత్, పాక్, బంగ్లాదేశ్‌లు మళ్లీ ఒక్కటవుతాయ్: రామ్ మాధవ్

అఖండ భారతావని ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు మళ్లీ ఒక్కటవుతాయని రామ్ మాధవ్ చెప్తున్నారు. కేవలం 60 సంవత్సరాల కిందట చారిత్రక కారణాలతో విడిపోయిన ఈ మూడు దేశాలు కలవడం ఖాయమని రామ్ మాధవ్ తెలిపారు. భారతదేశాన్ని హిందూ దేశంగా అభివర్ణించడంపై మాధవ్ మాట్లాడుతూ, అదొక సంస్కృతి మాత్రమేనన్నారు. 
 
దేశానికంతటికీ ఒకే సంస్కృతి ఉందని తెలిపారు. అలాగని తామేదో ఇతర దేశాల మీదకు యుద్ధానికి వెళతామని లేదా బలవంతంగా కలిపేసుకుంటామనో అనుకోనక్కర్లేదని రామ్ మాధవ్ తెలిపారు. విస్తృత ప్రజాభిప్రాయంతోనే ఇదంతా సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-పాక్-బంగ్లాదేశ్‌లు మళ్లీ ఏకమవుతాయని.. ఓ ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా తనకు నమ్మకం ఉందన్నారు.