బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2015 (16:54 IST)

భారత్ - పాకిస్థాన్ - బంగ్లాదేశ్‌లు ఒక్కటవుతాయా? .. రాంమాధవ్ ఏమంటున్నారు?

భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఒకనాడు అఖండ భారత్‌గా ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన వివిధ పరిణామాల వల్ల అఖండ భారత్ కాస్త మూడు ముక్కలైంది. అయితే, ఈ మూడు దేశాలు మళ్లీ ఒక్కటి అవుతాయని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ జోస్యం చెపుతున్నారు. 
 
అల్ జజీరా చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... త్వరలోనే అఖండ భారత్ కల సాకారమౌతుందని, అయితే, ఇది యుద్ధాల వల్ల కాదనీ, ప్రజాకాంక్షతోనే జరుగుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ కూడా ఇదే వాదనను చెపుతోంది. 
 
ఈ మూడు దేశాలూ మళ్లీ ఒక దేశంగా అఖండ భారత్‌గా అవతరిస్తాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గట్టిగా నమ్ముతోంది. ఈ మూడు దేశాల్లో ఒకప్పుడు ఒకే సంస్కృతి ఉండేదని గుర్తు చేసింది. తొలుత అంతా హిందువులేనని, ఆ తర్వాత కొందరి ఆరాధానా పద్ధతులు మాత్రమే మారాయన్నారు. ఈ మూడు దేశాలూ తిరిగి ఒక్కటయ్యే శుభ తరుణం కోసం దేశ భక్తులు ఎదురుచూస్తున్నారు.