1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. IndiGo Pilot Shares Rare Aerial Video Of Illuminated India-Pakistan Border: Glowing Line Of Lights

కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)

indo pak border
భారత్ పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు రాత్రివేళ కాంతిరేఖలా ప్రకాశవంతంగా మెరిసిపోతూ కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియా పైలెట్ ఒకరు షేర్ చేశారు. ప్రయాణికులకు సరిహద్దును చూపిస్తూ పైలెట్ ప్రకటన చేశారు. ఇరు దేసాల మధ్య రాజకీయ విభజనకు ఇది నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇపుడు కాక్‌పిట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఇండిగో పైలెట్, కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్, ఇటీవల ఒక రాత్రివేళ విమానాన్ని నడుపుతూ కాక్‌‍పిట్ నుంచి ఈ వీడియోను చిత్రీకరించారు. ఇందులో భారత్ - పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు (రాడ్‌క్లిఫ్ లైన్) వెంబడి ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్లు కారణంగా ఒక నిరంతరాయమైన పసుపు వర్ణం గీత స్పష్టంగా కనిపిస్తోంది. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న భద్రతా పోస్టుల నుంచి వస్తున్న కాంతులు కూడా ఈ వీడియోలో నమోదయ్యాయి. 
 
ఈ దృశ్యం కనిపిస్తున్న సమయంలో కెప్టెన్ ప్రదీప్ విమానంలోని ప్రయాణికులకు ఒక ప్రకటన చేశారు. లేడీస్ అండ్ జెంటిల్మన్.. మీరు విమానం కిటికీ నుంచి బయటకు చూస్తే ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన భారత భద్రత నడుమ ఉండే భారత్ పాకిస్థాన్ సరిహద్దును చూడొచ్చు అని ఆయన పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ, 'రాత్రిపూట అంతరిక్షం నుంచి కూడా భారత్ పాక్ సరిహద్దు కనిపిస్తుందని అంటారు. చీకటిని చీల్చుకుంటూ వెళ్లే ఈ కాంతి రేఖ ఆర్బిట్ నుంచి కూడా కనిపిస్తుంది' అని కెప్టెన్ ప్రదీప్ క్యాప్షన్ జోడించారు. 
 
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది ఒక అద్భుతమని, నమ్మశక్యం కాని దృశ్యమని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు సరిహద్దుకు 'ఇరువైపులా మంచి మనసున్న ప్రజలున్నారు. కానీ, రాజకీయాలు వారిని విడదీశాయి' అంటూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 


 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ... భర్తను చున్నీతో చంపేసిన భార్య .. ఎక్కడ?