బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2016 (16:44 IST)

అపూర్వ భారత్ ప్రచారకర్తగా ప్రధాని నరేంద్ర మోడీ : మనీశ్ శర్మ

అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియమితులయ్యారు. విదేశీయులను ఆకర్షించేందుకు ఆయనే సరైన వ్యక్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనీశ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం గతంలో మోడీ చేసిన ప

అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియమితులయ్యారు. విదేశీయులను ఆకర్షించేందుకు ఆయనే సరైన వ్యక్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనీశ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం గతంలో మోడీ చేసిన ప్రసంగాలను ప్రకటనలుగా రూపొందించి ప్రసారం చేస్తామని వెల్లడించారు. అదేసమయంలో ఇకపై అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటులను నియమించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్‌ గడువు ముగియడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించలేదు. ఆ తర్వాత అమితాబ్‌ బచ్చన్‌, ప్రియాంక చోప్రాల్లో ఎవరో ఒకరిని నియమించనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే, అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటులను నియమించే విధానానికి తాజాగా కేంద్రం స్వస్తి పలికింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించే అంశంలో మోడీని మించిన వ్యక్తి దేశంలో ఎవరూ లేరని పర్యాటక శాఖ మంత్రి మనీశ్‌ శర్మ అభిప్రాయపడ్డారు.