శనివారం, 14 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 ఫిబ్రవరి 2026 (15:54 IST)

Jalandhar man: ఐదేళ్ల పాపను కన్నతండ్రే కడతేర్చాడు.. గొంతు నులిమి చంపేశాడు.. ఎందుకంటే?

crime scene
ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్న ఐదేళ్ల పాపను కన్నతండ్రే కడతేర్చాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఏడుపు ఆపట్లేదని పాప మరింతగా ఏడవడంతో గొంతు నులిమి చంపేశాడు. డ్రగ్స్ మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డట్లు సమాచారం. 
 
చిన్నారి మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చండీగఢ్‌కు చెందిన అర్విందర్ సింగ్ భార్యాబిడ్డలతో కలిసి జలంధర్‌లోని దూరదర్శన్ ఎన్ క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు. 
 
అర్విందర్ రోజు కూలీగా పనిచేస్తుండగా.. ఆయన భార్య పనిమనిషిగా చేస్తోంది. కొంతకాలంగా అర్విందర్ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 3న భార్య పనికి వెళ్లగా కూతురు నిహారిక (5)తో పాటు అర్విందర్ ఇంట్లో ఉన్నాడు. మధ్యాహ్నం అర్విందర్ మద్యం సేవిస్తుండగా నిహారిక ఆకలవుతోందని ఏడవడం మొదలుపెట్టింది. 
 
తొలుత నిహారికను గద్దించిన అర్విందర్.. పాప ఏడుపు ఆపకపోయేసరికి నేలపైకి విసిరేశాడు. ఆపై గొంతు నులిమి చంపేశాడు. పనిముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి ఈ ఘోరం చూసి కన్నీటిపర్యంతమైంది.