1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Jaspal Rana, he was a great shooter, but could not aim at his heart artery, the heart stopped

Jaspal Rana, ఆయన దిగ్గజ షూటర్, కానీ తన గుండె ధమనిపై గురి పెట్టలేకపోయారు, హృదయం ఆగిపోయింది

Heart failure
Jaspal Rana Indian shooting legend and coach, ఆయన భారతదేశ దిగ్గజ షూటర్. లక్ష్యాన్ని గురి చూసి కొట్టడంలో ఆయనకు ఆయనే సాటి అంటారు ఆయన టార్గెట్ ఛేదనలను చూసినవారు. అట్లాంటి దిగ్గజం అయిన జస్పాల్... తన గుండె ధమనిపై గురి పెట్టలేకపోయారు. గుండెల్లో ఏదో తెలియని భారం, నొప్పి ఆవహించి బాధ పెడుతున్నా, అదేదో చిన్ని నొప్పి అయివుంటుందిలే అనుకున్నారు. 
 
గుండెల్లో ఏదో చిక్కబట్టి వుంటుందిలే అనుకున్నారు కానీ తన గుండెపై ధమని గురి చేసి కొడుతుందనీ, గుండెను స్తంభింపజేస్తుందని ఆయన అంచనా వేయలేకపోయారు. ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జర్మనీలో మ్యూనిచ్‍‌లో జరిగన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ నుంచి స్వదేశానికి తిరిగివస్తూ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చగా అప్పటికే ఆయన ఆరోగ్యం చేయి దాటిపోయిందని వైద్యులు గమనించారు. ఐనప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలప్రదం కాలేకపోయారు. తుదిశ్వాస విడిచారు.
 
 
జస్పాల్ రాణా... భారత పిస్టల్ షూటింగ్ జట్టుకు హై ఫెర్ఫార్మెన్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. జస్పాల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 'జస్పాల్ రాణా మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటు. షూటింగ్ సాధించిన అసాధారణ విజయాలతో దేశానికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. క్రీడల పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, ప్రతిభను వెలికితీయాలనే తపన అందరి ప్రశంసలు పొందాయి. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడా ప్రపంచానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ప్రధాని తన సందేశంలో తెలిపారు.
 
ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఎఐ) అధ్యక్షుడు కలికేశ్ నారాయణ్ సింగ్ దేవ్ పేర్కొన్నారు. ఆటగాడిగా జస్పాల్ రాణా అత్యంత విజయవంతమైన కెరీర్‌ను సొంతం చేసుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో నాలుగు ఎడిషన్‌లో పాల్గొని మొత్తం 15 పతకాలు సాధించారు. వీటిలో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. అలాగే ఆసియా క్రీడల్లో 8 పతకాలు గెలిచి భారత షూటింగ్‌కు విశేష సేవలందించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 1994లో అర్జున అవార్డు, 1997లో పద్మశ్రీ పురస్కారం లభించాయి. కోచ్‌గా చేసిన సేవలకుగానూ 2020లో దేశ అత్యున్నత కోచింగ్ పురస్కారం ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. 
About Writer
డా|| యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
కొల్లూరు మూకాంబికా దేవికి 1.6కిలోల వెండి ఖడ్గాన్ని ఇచ్చిన విజయ్