శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 22 జులై 2015 (17:50 IST)

మతి పోయిందా...? మాజీ రాష్ట్రపతి కలాం ఫోటోకు పూలమాల...నివాళి... ఏంటిది..?

జార్ఖండ్ విద్యాశాఖా మంత్రి మతిపోయినంత పని చేశారు. ఇంతకీ ఆమె ఏం చేశారు...?  ప్రముఖ సైంటిస్ట్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు పూలమాల వేసిన నీరా యాదవ్ ఘనంగా నివాళులర్పించి అబ్దుల్ కలాం బతికి ఉండగానే కొందరు ప్రముఖుల విషయంలో కొన్ని ఛానళ్లు ఇటీవలి కాలంలో చేసేసిన పనినే చేసేశారు. ఈ ఘటన అక్కడ సంచలనం రేపింది.

ఆ రాష్ట్రంలోని కోడర్మా ప్రాంతంలోని ఓ స్కూల్‌లో స్మార్ట్ క్లాసుల ప్రారంభోత్సవానికి విద్యా శాఖ మంత్రి నీరా యాదవ్ బుధవారం చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఆ సమయంలో ఆమె చేసిన పని అందరిని షాక్‌కు గురిచేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీరా యాదవ్ అకస్మాత్తుగా అక్కడ ఉన్న అబ్దుల్ కలాం ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ సమయంలో ఆమె వెంట ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్, స్కూల్ ప్రిన్సిపాల్‌ కూడా అన్నారు. అయితే అది రాష్ట్రపతి అబ్దుల్ కాలం ఫోటో అని ఎవరూ ఆమెకు చెప్పలేదు.
 
ఆ సమయంలో అక్కడే బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్, స్కూల్ ప్రిన్సిపాల్ తదితర ప్రముఖులు ఉన్నారు. అక్కడ అంతమంది ఉన్నప్పటికీ తాము అంజలి ఘటిస్తున్నది బ్రతికి ఉన్న వ్యక్తికి అని ఒక్కరు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఈ చర్య దుమారం రేపడంతో.. వెంటనే తేరుకున్న  మంత్రి నీరా యాదవ్ స్పందించారు.

చాలా స్కూల్స్ లో మహనీయుల చిత్రాలకు గౌరవంతో దండలు వేస్తారని, తాను కూడా అలాగే గౌరవ భావంతో దండ వేశానని ఆమె వివరణ ఇచ్చారు. అబ్దుల్ కలాం మహనీయుడు కాబట్టే.. దండ వేశానని అందులో తప్పేమీ లేదన్నారు. తాను నివాళులేమీ పలుకలేదని వివరణ ఇచ్చుకున్నారు. కానీ అక్కడ జరిగిన తంతు మాత్రం అలా లేదు మరి.