1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Justice Served In Meerut Snake Bite Plot: Wife And Lover Awarded Death Sentence For Murder

మీరట్ కేసు : భర్తను చంపి దుప్పట్లో పామును వదిలిన భార్యకు ఉరిశిక్ష

hang
భర్తను హత్య చేసి, పాముకాటు మరణంగా చిత్రీకరించిన కేసులో మీరట్‌కు చెందిన మహిళ రవితకు, ఆమె ప్రియుడికి కోర్టు మరణ శిక్ష విధించింది. గతేడాది ఏప్రిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌‍ కోర్టు ఇటీవల వారిద్దరినీ దోషులుగా తేలుస్తూ.. తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా వీరికి మరణ దండన విధిస్తూ తీర్పు వెలువరించింది. 
 
మీరట్‌లోని అక్బర్‌పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్‌ కశ్యప్‌ (25), అమర్దీప్‌ స్నేహితులు. అమర్‌దీప్‌ తరచూ అమిత్‌ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో అతడి భార్య రవితతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్త అమిత్‌కు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. 
 
దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన రవిత.. అమిత్‌ నిద్రిస్తున్న సమయంలో అతడిని గొంతు నులిమి హత్య చేసింది. కేసు తనపైకి రాకుండా ఉండేందుకు ప్రియుడి సాయంతో ఓ పామును కొనుక్కొచ్చి.. భర్త దుప్పట్లో వదిలింది. మరుసటి రోజు పాము కాటుతో తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. మృతుడి శరీరంపై పలుచోట్ల పాము కాట్లు ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. 
 
అయితే, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించగా అమిత్‌ ఊపిరాడకపోవడం వల్లే చనిపోయినట్లు నివేదికల్లో వెల్లడైంది. మృతుడి దుస్తుల్లో దొరికిన పాము కూడా విషపూరితం కాదని తేలడంతో పోలీసులు రవితను తమదైనశైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. భర్తను హత్య చేసిన రవితను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మీరట్ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించి మోసం చేశాడు..