1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Karnataka Farmer's Daughter Secures ₹46.33 Lakh Visa Job Offer

కర్నాటక రైతు బిడ్డకు రూ.46.33 లక్షల వీసా ఉద్యోగ ఆఫర్

Shristi Manjunath Ullagaddi
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ రైతు బిడ్డకు ఏకంగా రూ.46.33 లక్షల ఆఫర్‌తో వీసా ఉద్యోగం వరించింది. మూడ్‌బిద్రిలోని ఆల్వాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆఖరి యేడాది చదువుతున్నపుడే హవేరి జిల్లాలోని హట్టిమట్టూరు గ్రామానికి చెందిన రైతు కుమార్తె అయిన సృష్టి మంజునాథ్ ఉల్లగడ్డి, గ్లోబల్ పేమెంట్స్ దిగ్గజం వీసాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సంపాదించింది.
 
తన ఆరో సెమిస్టర్‌లో వీసాలో 10 వారాల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినందుకు, సృష్టి నెలకు రూ.90,000 స్టైపెండ్ అందుకుంది. ఆమె పనితీరుతో ఆకట్టుకున్న ఆ సంస్థ ఏకంగా యేడాదికి రూ.46.33 లక్షల ప్యాకేజీతో పూర్తికాలపు ఉద్యోగాన్ని ఖరారు చేసింది. ఇది ఆల్వాస్ ఇంజనీరింగ్ కళాశాల చరిత్రలోనే అత్యధిక ప్లేస్‌మెంట్ ప్యాకేజీగా నిలవడం గమనార్హం. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Lemon Prices: పెరిగిన నిమ్మకాయ ధరలు.. బస్తా ధర రూ. 16వేలు