1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Karnataka: Toddler dies after coconut falls on him while being carried by mother

Karnataka: చెట్టు పైనుంచి పడిన కొబ్బరికాయ.. బాలుడి తలపై పడటంతో మృతి

coconut
coconut
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. తల్లి తన ఏడాదిన్నర వయసున్న కుమారుడిని ఎత్తుకుని వెళ్తుండగా, చెట్టు పైనుంచి పడిన కొబ్బరికాయ బాలుడి తలకు బలంగా తగలడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 
 
మరణించిన బాలుడిని ప్రశాంత్, సుచిత్ర దంపతుల రెండవ కుమారుడైన దక్షగా గుర్తించారు. ఈ ఘటన బ్రహ్మావర్‌ తాలూకాలోని చంతర గ్రామం, హేరంజలులో మంగళవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. సుచిత్ర తన ఆరేళ్ల పెద్ద కుమారుడిని పాఠశాలలో దిగబెట్టడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె పెద్ద కుమారుడి చేయి పట్టుకుని, దక్షను తన భుజంపై ఎత్తుకుని వెళ్తోంది. 
 
భుజంపై దక్ష నిద్రిస్తుండగా, అకస్మాత్తుగా చెట్టు పైనుంచి పడిన కొబ్బరికాయ అతని తలకు బలంగా తగిలి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల సహాయంతో బాలుడిని వెంటనే మణిపాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, అతను చికిత్స పొందుతూ మరణించాడు.
 
 ఈ చిన్నారి అకాల మరణం మొత్తం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. స్థానికులు ఈ విషాదకరమైన ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మావర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
యాపిల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదార్లకు శుభవార్త