1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Kolkata-based lottery firm gave Rs 260 crore to DMK, AIADMK in 2025-26: EC filings

లాటరీ కంపెనీ నుంచి డీఎంకే - అన్నాడీఎంకేలకు రూ.260 కోట్ల విరాళం

cash
తమిళనాడు రాజకీయాల్లో బద్ధ విరోధులైన డీఎంకే, అన్నాడీఎంకేలకు ఒకే సంస్థ నుంచి భారీగా నిధులు అందిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా కేంద్రంగా పని చేసే టైరగ్ అసోసియేట్స్ అనే లాటరీ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పార్టీలకు కలిసి ఏకంగా రూ.260 కోట్ల విరాళాలు అందించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికల ద్వారా ఈ కీలక సమాచారం బయటపడింది. 
 
టైగర్ అసోసియేట్స్ సంస్థ అన్నాడీఎంకేకు ఆరు లావాదేవీల ద్వారా రూ.135 కోట్లు, డీఎంకేకు రూ.14 లావాదేవీల ద్వారా రూ.125 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇది ఆ యేడాది ఆయా పార్టీలకు అందిన మొత్తం విరాళాల్లో చాలా పెద్ద మొత్తం కావడం గమనార్హం. 
 
అన్నాడీఎంకేకు వచ్చిన మొత్తం విరాళాలు రూ.161.36 కోట్లు కాగా, అందులో దాదాపు 81 శాతం వాటా టైగర్ అసోసియేట్స్ నుంచే రావడం గమనార్హం. అదేవిధంగా డీఎంకేకు అందిన రూ.191.19 కోట్ల విరాళాల్లో 65 శాతానికిపైగా ఇదే సంస్థ నుంచి సమకూరింది. 
 
అంతకుముందు యేడాదితో పోలిస్తే ఈ సంస్థ ఇచ్చిన విరాళాలు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. 2024-25లో ఈ రెండు పార్టీలకు కలిసి రూ.110 కోట్లు ఇచ్చిన టైరగ్ అసోసియేట్స్‌, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.370 కోట్లు అందించింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పుంగనూరు ఘటన వెనుక పెద్దిరెడ్డి కుటుంబం : ప్రత్యక్ష సాక్షిని నేనే : రామచంద్ర యాదవ్