నేషనల్ హైవే-48పై పల్టీ కొట్టిన సిలిండర్లతో కూడిన లారీ.. ఎత్తుకెళ్లిన స్థానికులు
ఇరాన్- ఇజ్రాయేల్ యుద్ధ నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. దీంతో డిమాండ్ కాస్త పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ రహదారిపై ఓ సిలిండర్లను మోసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. అంతే సిలిండర్లు రోడ్డుపై అలా పండుంటాన్ని చూసి అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. అందరూ దొరికింది దొరికినంత వరకు పట్టుకెళ్లారు. కొందరైతే పేలుతాయనే భయంతో దూరంగా వుండిపోయారు.
కానీ స్థానికులు మాత్రం సిలిండర్లు రోడ్డుపై పడిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్లను చెల్లాచెదురుగా పడిన వాటిని సేకరించడంలో మరికొంత మంది స్థానికులు సహాయం చేశారు. ఆపై సిలిండర్లు లీక్ అవుతున్నాయా లేవా అని చెక్ చేశారు. అవి సురక్షితంగా వున్నాయని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జైపూర్ నుంచి అజ్మేర్ వైపు వెళ్తున్న నేషనల్ హైవే-48పై చోటుచేసుకుంది.