1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Madhya Pradesh's Panna District Hospital flooded after the first rains

ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి జనరల్ వార్డులో వర్షపు నీరు (వీడియో)

rain water in hospital ward
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా ప్రభుత్వం ఆస్పత్రిలోని జనవర్ వార్డులోకి వర్షపునీరు వచ్చింది. కురిసిన చిన్నపాటి వర్షానికే ఆస్పత్రిలోకి నీరు వచ్చింది. ముఖ్యంగా, ఆస్పత్రిలోని జనరల్ వార్డులో నీరు వచ్చి చేరడంతో చిన్నపాటి ఈతకొలనుగా మారిపోయింది. 
 
ఆస్పత్రి జనరల్ వార్డులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో నీరు నిలిచిపోవడంతో అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయని రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. అదేసమయంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఓడిన కన్నప్రేమ - కుమార్తె కాళ్లపై పడినా కనికరించలేదు... 
 
తమిళనాడు రాష్ట్రంలో కన్నప్రేమ ఓడిపోయింది. ప్రియుడిని వదిలిపెట్టాలంటూ కుమార్తె కాళ్లపై పడి తల్లిదండ్రులు ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది. కన్నతల్లిదండ్రులు కాళ్లమీద పడినా ఆ కుమార్తె కనికరించలేదు. తల్లిదండ్రులను కాదని ప్రేమించిన ప్రియుడుతోనే వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటకు చెందిన ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, యువతి తల్లిదండ్రులు అందుకు నిరాకరించేలుద. ఈ క్రమలో వారు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు పోలీసులు చేరవేశారు. 
 
దీంతో ఠాణాకు వచ్చిన యువతి తల్లిదండ్రులు... కన్నకుమార్తె కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. ఆ యువకుడు మంచోడు కాదని, అమ్మాయిల పొరికి అంటూ ఎన్ని చెప్పినా ఆ యువతి వినలేదు కదా కనీసం కన్నతల్లి ముఖాన్ని కూడా చూసేందుకు ఇష్టపలేదు. ఫలితంగా తన ప్రేమ ముందు కన్నప్రేమ ఓడిపోయింది. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెలుగు విద్యార్థిని మృతి