శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (18:45 IST)

వేప ఆకులు, కాకరకాయలను లొట్టలేస్తూ చాక్లెట్లలా తినేస్తున్న రెండేళ్ల చిన్నారి

సాధారణంగా చిన్నపిల్లలు చాక్లెట్లు, స్వీట్లను ఇష్టంగా ఆరగిస్తారు. కానీ, ఈ చిన్నారి మాత్రం చెట్ల ఆకులను చాక్లెట్లలా తినేస్తుంది. మామిడి, తులసి ... ఇలా ఏ చెట్టు ఆకులు అయినా సరే హ్యాపీగా ఆరగించేస్తోంది. ఆ

సాధారణంగా చిన్నపిల్లలు చాక్లెట్లు, స్వీట్లను ఇష్టంగా ఆరగిస్తారు. కానీ, ఈ చిన్నారి మాత్రం చెట్ల ఆకులను చాక్లెట్లలా తినేస్తుంది. మామిడి, తులసి ... ఇలా ఏ చెట్టు ఆకులు అయినా సరే హ్యాపీగా ఆరగించేస్తోంది. ఆ చిన్నారి పేరు అనన్య. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌వాసి. వయస్సు రెండేళ్లు. బిస్కెట్లు, జెమ్స్, ఫైవ్ స్టార్ చాక్ లెట్ల కంటే ఇష్టంగా ఆకులు తినేస్తుంది. ముఖ్యంగా వేప ఆకులు, కాకరకాయలను లొట్టలేస్తూ తినేస్తుంది. కేవలం ఇవే కాదు, మామిడి, తులసి ... ఇలా ఏ చెట్టు ఆకులు అయినా తినేస్తుందని చిన్నారి తండ్రి అమర్ సింగ్ చెబుతున్నాడు. 
 
అనన్యకు ఈ అలవాటు ఎలా వచ్చిందనే విషయమై ఆయన మాట్లాడుతూ, చెట్ల ఆకులు తింటుంటే చిన్న పిల్ల కదా, తెలియక చేస్తోందనుకున్నామని చెప్పారు. అలా చేయవద్దంటూ చెప్పి, ఆమె చేతిలోని ఆకులను లాగేస్తే ఏడుస్తుందని, ఆకులు తినకుండా అనన్య ఉండలేకపోతోందని వాపోయారు.