సంబంధిత వార్తలు
- రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు : హైకోర్టులో ఆర్తి పిటిషన్
- పీవీ కుమారుడితో సుకన్యకు అక్రమ సంబంధం.. వీరప్పన్ ఇంటర్వ్యూ.. సన్‌టీవీకి షాకిచ్చిన కోర్టు
- విజయ్ పార్టీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు - బల పరీక్షలో ఓటు వేయడానికీ వీల్లేదంటూ ఆదేశం
- విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు.. ఆస్తి విలువ ఎందుకు తేడా చూపించారు?
- Tamannaah Bhatia: తమన్నా భాటియాకు కోర్టులో చుక్కెదురు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నిక చెల్లదు : కోర్టుకెక్కిన డీఎంకే నేత
టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సి.జోసెఫ్ విజయ్ ఎన్నిక చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే నేత ఒకరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విజయ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో కేసుల వివరాలను దాచిపెట్టారని పేర్కొన్నారు. అందువల్ల ఆయన ఎన్నిక చెల్లదని పేర్కొంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. సీఎం విజయ్‌తో పాటు రాష్ట్ర క్రీడా శాఖామంత్రి ఆదవ్ అర్జున గెలుపుపై వచ్చిన పిటిషన్‌లను కూడా జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ ఏకసభ్య ధర్మాసనం విచాణకు స్వీకరించింది. ఈ పిటిషన్లలో ఉన్న కొన్ని సాంకేతిక లోపాలను వారం రోజుల్లోగా సరిదిద్దాలని కోర్టు ఆదేశించింది. ఆ ప్రాసెస్ పూర్తి కాగానే విజయ్‌తో పాటు మంత్రికి మూడు వారాల గడువిస్తూ రిజిస్ట్రీ నోటీసులు జారీ చేయనుంది.
అయితే, ఈ వ్యవహారంలో హైకోర్టు జడ్జి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఏళ్ల తరబడి సాగే ఈ ఎన్నికల పిటిషన్ల విచారణను అత్యంత వేగంగా, కేవలం ఆరు నెలల లోపే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విజయ్ విజయాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ ఈ పిటిషన్ వేశారు. నామినేషన్ అఫిడవిట్లో విజయ్ తనపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను దాచారని, అలాగే ఎన్నికల ఖర్చులను కూడా పూర్తిగా చూపించలేదని ఇగో తన ఫిర్యాదులో ఆరోపించారు.
దీనికితోడు, ఎన్నికల ప్రచారంలో నిబంధనలకు విరుద్ధంగా చిన్నపిల్లలను వాడుకున్నారనే అంశాన్ని కూడా పిటిషనులో ప్రస్తావించారు. ఈ కారణాలన్నింటినీ చూపిస్తూ విజయ్ విజయాన్ని రద్దు చేసి, తనను విజేతగా ప్రకటించాలని ఇనిగో కోరారు. అంతేకాకుండా, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఉపఎన్నికపై కూడా స్టే విధించాలని అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి హైకోర్టును కోరడంతో ఇప్పుడు ఈ సరికొత్త పొలిటికల్ వార్ తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.
