1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. man allegedly dupes woman of Rs.1.25 lakh inside sbi while helping with deposit form in jind

సాయం చేస్తానంటూ నమ్మించి యువతి నుంచి రూ.1.25 లక్షల చోరీ (Video)

cash theft video
హర్యానా రాష్ట్రంలో పట్టపగలు, బ్యాంకులో ఓ దారుణం జరిగింది. సాయం పేరుతో ఓ యువతిని నమ్మించిన ఓ వ్యక్తి.. ఆమె చేతిలో ఉన్న రూ.1.25 లక్షల నగదు బ్యాగుతో ఉడాయించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన హర్యానా రాష్ట్రం, జింద్ జిల్లా సఫిదో అనే ప్రాంతంలో జరిగింది. 
 
మువానా గ్రామానికి చెందిన పాయల్ అనే యువతి రూ.1.25 లక్షలు డిపాజిట్ చేయడానికి సోదరుడితో కలిసి స్థానికంగా ఉండే భారతీయ స్టేట్ బ్యాంకుకు వెళ్లింది. ఆమె పక్కనే ఉన్న ఓ దొంగ సహాయం చేస్తున్నట్టుగా నమ్మంచి, నటించి రూ.1.25 లక్షలతో ఉన్న బ్యాంగును లాక్కొని ఉడాయించాడు. 
 
తొలుత డిపాజిట్ ఫామ్ నింపిన ఆ దొంగ, ఉద్దేశ్యపూర్వకంగానే అకౌంట్ నంబర్‌ను తప్పుగా రాశాడు. అకౌండ్ నంబర్ తప్పుగా ఉండటం గమనించి క్యాషియర్ ఆ ఫామ్‌ను రిజెక్ట్ చేశాడు. అపుడు కొత్తగా మరో ఫామ్ నింపుతుండగా ఆ దొంగ రూ.1.25 లక్షల క్యాష్ బ్యాంగ్ తీసుకుని పారిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దొంగ కోసం గాలిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NEWS9 (@news9live)

About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
October 04, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?