మంగళవారం, 17 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 19 జనవరి 2026 (13:59 IST)

బస్సులో అసభ్యంగా తాకాడని వీడియో తీసి వైరల్ చేసిన యువతి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి (video)

young woman who filmed a video of a man touching her inappropriately
ఓ యువతి కేరళలో బస్సు ప్రయాణం చేస్తోంది. ఈ ప్రయాణంలో దీపక్ అనే వ్యక్తి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడనీ, తనను అసభ్యంగా తాకాడంటూ సదరు యువతి అదంతా వీడియో తీసింది. ఈ వీడియోను కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
వీడియోను చూసిన పలువురు నెటిజన్లు అతడికి చీవాట్లు పెట్టారు. బస్సులో ఇదేం పాడుబుద్ధి తిన్నగా నిలబడలేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ వీడియోను దీపక్ చూసాడు.
 
తను అలాంటివాడిని కాదంటూ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన స్వభావం అలాంటిది కాదనీ, ఏదో తెలియకుండా జరిగి వుంటుందనీ, తన క్యారెక్టర్ పైన ఇలాంటి ముద్ర వేస్తారా అంటూ తీవ్ర అవమానభారంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.