1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Man dies in old-age home, daughters watch funeral on video call, pay Rs 5,100

తండ్రి అంత్యక్రియలకు రాని కుమార్తెలు.. వీడియో కాల్ ద్వారా అంతా ముగించేశారు.. (video)

funeral on video call
funeral on video call
హర్యానాలోని సోనిపట్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకప్పుడు మహారాష్ట్రలో ప్రముఖ వస్త్ర వ్యాపారిగా రాణించిన శివచరణ్ రతన్ గుప్తా అనే వృద్ధుడి అంత్యక్రియలు వారి కుటుంబ సభ్యులు లేకుండానే జరిగిపోయింది. 
 
వృద్ధాశ్రమంలో కడవరకు ఏ ఒక్క పిల్లవాడూ దగ్గర లేకుండా గడిపిన అతను చివరకు కన్నుమూశారు. ప్రాణాపాయ స్థితిలో తన ముగ్గురు కుమార్తెలను చూడాలని ఆయన తపించినా.. ఏ ఒక్కరూ రాలేకపోయారు. చివరికి తండ్రి అంత్యక్రియలను విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వీడియో కాల్ ద్వారా వీక్షించి తమ మమకారాన్ని చూపెట్టారు. 
 
తన ముగ్గురు కుమార్తెలను బాగా చదివించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసిన ఆయన అంత్యక్రియలు దారుణంగా జరిగాయి. పెద్ద కుమార్తె అనిత నేపాల్‌‌లో టీచర్‌గా స్థిరపడ్డారు. రెండో కుమార్తె నిషా యూపీలో అజంఘడ్‌లో వుంటారని, ఇక మూడో కుమార్తె ముంబైలో నివాసముంటున్నాడు. 
 
ఈ ముగ్గురు తమ తండ్రి చనిపోయిన విషయం తెలిసి అంత్యక్రియలకు రాలేదు. శివచరణ్ ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కుమార్తెలకు ఫోన్ చేసి, తండ్రిని చూడటానికి రావాలని మేనేజ్‌మెంట్ ఎంత విజ్ఞప్తి చేసినా.. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తూ రావడానికి నిరాకరించారు. ఇక అంత్యక్రియలకు గూగుల్ పేలో డబ్బులు పంపి.. వీడియో కాల్ ద్వారా తతంగాన్ని ముగించేశారు. ఆస్తికలను కూడా తాము వచ్చి తీసుకెళ్లలేమని, గంగలో కలిపేయమని చెప్పారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
భారీగా ఎగబాకిన బంగారం ధరలు.. పసిడి, వెండి ధరలకు రెక్కలు..