1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2016 (15:08 IST)

నా వాడంటే.. నా వాడు.. తల్లీకూతుళ్ల సవతిపోరు.. లవర్ కోసం జుట్టుపట్టుకుని..?!

తల్లికి కూతురికి ఒకే బాయ్ ఫ్రెండ్ ఉండడం..ఎక్కడైనా వినున్నామా... అంతేకాదు...ఆ యువకుడి కోసం తల్లి కన్నకూతురినే హతమార్చింది. సభ్యసమాజమే తలదించుకునే ఈ ఘటన చంఢీగడ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.... మంజు అనే 37 ఏళ్ల వివాహితకు దీక్ష అనే 17 ఏళ్ల కూతురు ఉంది. కాగా.. మంజుకి ఫేస్‌బుక్ ద్వారా సౌదీ అరేబియాలో ఉండే విజయ్ అనే వ్యక్తితో 2015 అక్టోబర్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా చిగురించింది. ఆ ప్రేమ కాలక్రమేణా విడదీయరాని బంధంగా మారిపోయింది. 
 
ఈ దూరాన్నిభరించలేని విజయ్ డిసెంబర్‌లో రెక్కలు కట్టుకుని ఇండియాలో వాలిపోయాడు. జనవరి నుంచి మంజు ఇంట్లోనే ఉంటూ మంజుతో సహజీవనం చేసేవాడు విజయ్. ఈ క్రమంలో ఆమె కూతురు దీక్షపై కూడా కన్నేసాడు ఈ కామాంధుడు. దీక్షతో విజయ్ బాగా సన్నిహితంగా ఉండడంతో.. దీక్ష కూడా అతని వలలో పడిపోయింది. ఇదిలా ఉంటే ఒకరోజు మంజు, విజయ్ పడగ గదిలో సరససల్లాపాలు సాగిస్తుండడం చూసి దీక్ష నివ్వెరపోయింది. ఈ విషయంపై దీక్ష తల్లితో గొడవ పడింది. తాను విజయ్‌ని గాఢంగా ప్రేమిస్తున్నట్లు తల్లితో చెప్పింది. 
 
ఈ విషయంలో వీరి మధ్య గొడవ మొదలయ్యింది. చిన్నగా మొదలైన గొడవ పెను తుఫానులా మారింది. అతను నా వాడంటే ... నా వాడని.. అతడిని నేనే మొదట ప్రేమించాను.. నేనే ప్రేమించానని వాగ్వాదానికి దిగారు. జుట్టుపట్టుకోవడం ఒక్కటే తరువాయి. కాగా విజయ్ మీదున్న ప్రేమతో దీక్ష తన మణికట్టుపై విజయ్ పేరుని పచ్చ పొడిపించుకుంది. దీనితో తన ప్రియుడిని కూతురు ఎక్కడ ఎగరేసుకుపోతుందోనన్న భయంతో మంజు ఏ తల్లి చేయని పనిని చేయడానికి నిర్ణయించుకుంది. కూతుర్ని చంపేందుకు పథకం వేసింది. 
 
పక్కా ప్లాన్ ప్రకారం గత నెల 24న ప్రియుడితో చేతులు కలిపి ఫ్యాన్‌కు ఉరివేసి దీక్షను చంపేశారు. కుటుంబ తగాదాల కారణంగానే దీక్ష ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అందరిని నమ్మించారు. దీక్ష రాసినట్టుగానే విజయ్ సూసైడ్ నోట్ రాసి మరీ పెట్టాడు. పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. కాని ఈ హత్యపై విచారణ జరిపిన పోలీసులు దీక్ష చేతిపై విజయ్ పేరు పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించారు. తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయాన్ని నిందితులు ఒప్పుకున్నారు.