1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Mr. CM Vijay, we don-t want your free electricity; we will pay for it, just supply it, please!, Dissatisfaction brews in Tamil Nadu; Video

అయ్యా సీఎం విజయ్ నీ ఉచిత కరెంట్ మాకొద్దు, డబ్బులిస్తాం ఇవ్వు నాయనా: తమిళనాడులో మొదలైన అసంతృప్తి, వీడియో

woman-vijay
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ అయితే కాన్వాయిలో కొత్త కారుతో సరికొత్త సీఎం అంటూ సోషల్ మీడియాలో పలు వీడియోల్లో పలు యాంగిల్స్‌లో కనబడుతున్నారు. రోడ్డున వెళ్లేవారికి టాటాలు చెబుతున్నారు. కానీ ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నానా తంటాలు పడుతున్నారు. గద్దెనెక్కిన రోజుల వ్యవధిలోనే పరిస్థితి ఏమిటో కొంతమంది రీల్స్ ద్వారా విజయ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ఏకంగా ఫలానా ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం... మా పరిస్థితి ఇలా వుంది అని చెబుతున్నారు. 
 
తాజాగా ఓ మహిళ అర్థరాత్రి వేళ ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలింది. అందులో ఆమె మాట్లాడుతూ... అయ్యా సీఎం, నీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ మాకు అవసరం లేదు. దయచేసి డబ్బులకే కరెంట్ ఇవ్వండి. మేము మనీ పే చేస్తాము. రాత్రి 11 గంటలకు పోయన కరెంట్ వేకవ జామున 3 గంటలకు కూడా రాలేదు. కరెంట్ లేక ఇంట్లో చంటిపిల్ల ఎంత బాధ పడుతుందో మీకేం తెలుసు. ఇలాగేనా మీరు ఉచిత కరెంట్ ఇచ్చేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
మాసాబ్ ట్యాంక్‌లో దారుణం : న్యాయవాదిను కారుతో ఢీకొట్టించి చంపేశారు...