సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జనవరి 2026 (21:40 IST)

సోమనాథ్ ఆలయంలో అంబానీ దంపతుల పూజలు - రూ.5 కోట్ల విరాళం

mukesh - nita - ananth
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయాన్ని శుక్రవారం సందర్శించారు. ద్వాదశ జ్యోతిర్లాంగల్లో ఒకటైన ఈ శైవక్షేత్రంలో ఆయన తన సతీమణి నీతా అంబానీ, తనయుడు అనంత్ అంబానీతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
mukesh - nita - ananth
 
ముందుగా ఆలయానికి చేరుకున్న అంబానీ దంపతులకు ఆలయ ట్రస్ట్ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అంబానీ దంపతులకు సోమనాథుడి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సోమనాథ్‌ క్షేత్రానికి ముఖేశ్‌ అంబానీ రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు. గతేడాది జనవరిలోనూ ముఖేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీ సోమనాథుడిని దర్శించుకున్న విషయం తెల్సిందే.