1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Mumbai Man Keeps Wife In 'Rooster' Position For 4 Hours, Stabs As She Escapes

భర్త కిరాతక చర్య : భార్యను గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి చిత్రహింసలు

Harassment
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యంత దారుణమైన గృహహింస ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ హిస్టరీ షీటర్ తన భార్యను గంటల తరబడి కోడిపుంజు భంగిమలో నిలబెట్టి చిత్రహింసలకు గురిచేయడమేకాకుండా, ప్రాణభయంతో పుట్టింటికి పారిపోయిన ఆమెను వెంటాడి కత్తితో దాడి చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల సకాలంలో స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు.. ముంబైకు చెందిన రౌడీషీటర్ అర్బాజ్ సయ్యద్ (25). భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కుటుంబ తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇంట్లో భార్యను ఓ గదిలో బంధించారు. కత్తి చూపించి చంపేస్తామని, ముఖంపై యాసిడ్ పోస్తామని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆమెను దాదాపు నాలుగు గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి పైశాచిక ఆనందం పొందారు. 
 
అతడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు ప్రాణభయంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, అప్పటికీ ఆమెను వదలని కిరాతక భర్త నేరుగా అత్తారింటికి చేరుకున్నాడు. అక్కడ కూడా భార్యపై ఆగ్రహంతో ఊగిపోతూ తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడితో భయపడిపోయిన బాధితురాలి కుటుంబం సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
 
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నేర చరిత్రను పరిశీలించగా అర్బాజ్‌పై హత్యాయత్నం, దోపిడీ వంటి 19 తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదైవున్నాయని తేలింది. గాయపడిన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం, కిడ్నాప్‌తో సహా పలు కేసులు ఉన్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
గుజరాత్‌లో దారుణం : ఇద్దరు మైనర్ బాలికలు గర్భం - చోద్యం చూసిన తల్లి