భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్
భారతీయ జనతా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుంది. భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
బీహార్‌లోని బాంకీపుర్ అసెంబ్లీ స్థానం నుంచి నితిన్ నబీన్ వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రహదారుల నిర్మాణశాఖ మంత్రిగా ఉన్నారు. భాజపా ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2020 జనవరిలో ఈ పదవిలో నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ.. పొడిగించారు.
ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేసిన ప్రకటనలో పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబీన్‌ను పార్టీ జాతీయ కార్యానిర్వాహక అధ్యక్షుడు నియమించింది అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.