శనివారం, 18 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2026 (13:17 IST)

బీహార్ రాజకీయాల్లో సంచలనం : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న నితీశ్

nitish kumar
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, రాజ్యసభకు వెళ్లనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
 
'గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు. బిహార్ అభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేశాను. నా పార్లమెంటరీ జీవితం ప్రారంభమైనప్పటి నుండి నాకు ఒక కోరిక ఉండేది.. రాష్ట్రంలోని రెండు చట్టసభలతో (అసెంబ్లీ, కౌన్సిల్) పాటు, పార్లమెంట్లోని రెండు సభలకు (లోకసభ, రాజ్యసభ) ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నాను. ఆ కోరికను నెరవేర్చుకోవడానికే ఇప్పుడు రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను'అని నితీశ్ పేర్కొన్నారు.
 
రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో నీతీశ్ కుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. నితీశ్ తప్పుకొ కోవడంతో బిహార్‌కు కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. ప్రస్తుతం జేడీయూ-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నందున, ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. 'కొత్త బాధ్యతలు చేపట్టినప్పటికీ, బిహార్ నా బంధం కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు ఉంటుంది' అని నితీశ్ హామీ ఇచ్చారు.s
 
బిహార్ రాజకీయాల్లో 'చాణక్యుడిగా' పేరున్న నితీశ్ కుమార్, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాతి పరిణామాల నేపథ్యంలో, ఆయన రాజ్యసభకు వెళ్లడం జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. మరికొన్ని గంటల్లోనే బిహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారు కానుంది. నితీశ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను