నోయిడాలో 43వ అంతస్థు నుండి దూకి ఎంసీఏ విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదే..?
Noida
కింద పడిన ధాటికి ఆ యువకుడి శరీరం రెండు ముక్కలైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆత్మహత్య చేసుకున్న యువకుడు సూపర్‌నోవాలోని ఒక ఎయిర్‌బిఎన్‌బి అపార్ట్‌మెంట్‌లో బస చేస్తున్నాడు.
కాగా, ఆ వ్యక్తి భవనం పైనుంచి దూకుతున్న దృశ్యాలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతని వివరాలు మరియు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, ఆ యువకుడిని దూకకుండా ఆపడానికి ప్రయత్నించిన ఒక ఏసీ మెకానిక్ తెలిపిన వివరాల ఆధారంగా, తాను తీవ్ర మానసిక ఒత్తిడి (డిప్రెషన్)తో ఉన్నానని చెప్పిన తర్వాతే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానికులు భయాందోళనల మధ్య తీసిన ఆత్మహత్య వీడియో వైరల్ అయ్యింది. గత నెలలో జరిగిన మరో ఆత్మహత్య ఘటనలో, గ్రేటర్ నోయిడాలోని బీటా-2 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెక్టార్ ఆల్ఫా-2లో ఒక మొదటి సంవత్సరం ఎంసీఏ విద్యార్థి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.ఇంకా ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లా, పట్యాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా ఖగో గ్రామానికి చెందిన ఉమేష్ చంద్ర కుమారుడు అభిషేక్‌గా గుర్తించారు.
అభిషేక్ సెక్టార్ ఆల్ఫా-2, బ్లాక్ హెచ్, ఇంటి నంబర్ 364లో నివసిస్తున్నాడు. ఘటనకు సుమారు నెల రోజుల ముందు అతను నోయిడాకు వచ్చాడని, ఆన్‌లైన్ తరగతుల ద్వారా మొదటి సంవత్సరం ఎంసీఏ చదువుతున్నాడని సమాచారం.

