సంబంధిత వార్తలు
- ఇదిగో నా బంగారం, నా బీరువా అంటూ మొత్తం చూపించేసింది: యూ ట్యూబర్ ఇంటిని దోచేసిన దొంగలు, వీడియో
- ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... రోగులను వదిలేసిన పారిపోయిన సిబ్బంది
- 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
- ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య
- ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్
బంగారం కాదు.. నగదు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే దోచుకున్నారు.. ఎక్కడ?
Bihar Cell Tower
బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిరంతరాయంగా టెలికాం సేవలను అందిస్తున్న ఒక పెద్ద మొబైల్ టవర్‌ను దొంగలు గుట్టుచప్పుడు కాకుండా విరగ్గొట్టి, ముక్కలు ముక్కలుగా చేసి తరలించేశారు. కేవలం టవర్‌ను మాత్రమే కాకుండా, అక్కడ అమర్చిన భారీ జనరేటర్, దానికి సంబంధించిన ఇతర విలువైన టెలికాం సామగ్రిని కూడా దొంగలు వదలకుండా ఎత్తుకెళ్లడం గమనార్హం.
ఇటీవల సదరు టెలికాం కంపెనీ అధికారులు, సాంకేతిక సిబ్బంది నిరంతర నిర్వహణ పనుల కోసం ఆ సైట్ వద్దకు వెళ్ళినప్పుడు, అక్కడ టవర్ లేకపోవడాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంకా స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మొబైల్ టవర్ చోరీ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
