1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Not Inviting Vijay To Form Government Is Disrespecting Mandate : Kamal Haasan

విజయ్‌‍ను సీఎం కాకుండా అడ్డుకోవడమంటే ప్రజా తీర్పును అగౌరవ పరిచినట్టే : కమల్ హాసన్

kamal haasan
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. టీవీకే అధ్యక్షుడు విజయ్‌ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమంటే ప్రజా తీర్పుని అగౌరవ పరిచినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.  
 
కాగా, ఈ నెల 4వ తేదీన వెల్లడైన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేలు రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యాయి. అయితే, అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ఆహ్వానించలేదు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి..
 
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ స్పందించారు. '108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడాన్ని కమల్ తప్పుబట్టారు. ఇది ప్రజా తీర్పును అగౌరవ పరచడమేనని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు'. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్  చేశారు. 
 
"విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకుంది. వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అవమానపరచడమే. ఎన్నికైన సభ్యులు ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం రాష్ట్రానికి జరిగిన అవమానం. ప్రజాస్వామ్యానికి కలిగి నష్టం' అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయన గుర్తు చేశారు. మెజారిటీని రాజ్‌భవన్‌లో కాదు.. శాసనసభలో నిరూపించుకోవాలని ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. నేను పార్టీ రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. ఒక భారతీయ పౌరుడుగా విధానపరమైన గళం వినిపిస్తున్నాను. తమిళనాడు ప్రజల తీర్పును తప్పక గౌరవించాలి అని కమల్ హాసన్ తన పోస్టులో పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
What Is Hantavirus: క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్.. ముగ్గురు మృతి.. లక్షణాలేంటి?