సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మార్చి 2026 (13:36 IST)

Odisha Woman: పెళ్లి చేసుకుంటానని ఒకడు.. సాయం చేస్తానని మరొకడు.. యువతిపై అత్యాచారం

rape
పెళ్లి చేసుకుంటానని ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు యువతి అకృత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశా, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 22న ఒక 23 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. గుడిలో పెళ్లి చేసుకుందామని అతను నమ్మించడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. 
 
అయితే, ఆ వ్యక్తి ఆమెను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను రహమా బస్టాండ్‌లో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో బస్టాండ్‌లో ఉన్న ఆ యువతిని చూసి, జార్ఖండ్‌కు చెందిన మరో వ్యక్తి సాయం చేస్తానని నమ్మబలికాడు. 
 
మోటార్ సైకిల్‌పై వెళ్తున్న అతను ఆమెను తన అద్దె ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ భవనం పైకప్పు మీద ఆమెపై మళ్ళీ అత్యాచారానికి పాల్పడ్డాడు. తన పాపం బయటపడుతుందనే భయంతో, ఆ యువతిని భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.