గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 జనవరి 2026 (13:23 IST)

వామ్మో... ఫ్లాట్స్ మధ్యలోకి 12 అడుగుల నల్లత్రాచు (video)

King cobra
ఫ్లాట్స్ మధ్యలోకి సుమారు 12 అడుగులకు పైగా పొడవున్న నల్లత్రాచు వచ్చేసింది. దీనితో ఫ్లాట్స్ నివాసితులు అందరూ బెంబేలెత్తిపోయారు. వెంటనే పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చారు. ఆ పామును వాళ్లు ఎలా పట్టుకున్నారో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
 
నల్లత్రాచును బంధించేందుకు పాములుపట్టే వ్యక్తి ఓ తగరం గోతాన్ని, ప్లాస్టిక్ పైపును ఉపయోగించాడు. ఆ పాము మీదకి వస్తున్న చాకచక్యంగా తప్పించుకున్నాడు. చివరికి అది పైపులోకి తల భాగాన్ని పెట్టగానే అతడు వెంటనే పామును లోపలికి నెడుతూ సంచీలోకి పంపి పామును బంధించేసాడు. దీనికి సంబంధించిన వీడియో హల్చల్ చేస్తోంది.