గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (16:30 IST)

హనుమంతుడికి తనలోని శక్తి తెలియదు.. పాక్‌కు మన ఆర్మీ శక్తిని తెలిపాను: మనోహర్ పారికర్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకుని వెళ్లి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత జవాన్లు మెరుపుదాడి జరపడంపై భారత రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ ప్రశంసించారు. భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులపై ఆయన స్పందిస్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకుని వెళ్లి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత జవాన్లు మెరుపుదాడి జరపడంపై భారత రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ ప్రశంసించారు. భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులపై ఆయన స్పందిస్తూ రామాయణంలోని హనుమంతుడిని గుర్తు చేశారు. సీతాన్వేషణ కోసం శ్రీలంకకు వెళ్లేముందు హ‌నుమంతుడికి త‌నలో ఉన్న శ‌క్తి ఏంటో తెలియదని, అనంత‌రం తెలిసింద‌ని చెప్పారు. 
 
అలాగే, రామాయ‌ణాన్ని గుర్తు చేసిన మ‌నోహ‌ర్ పారిక‌ర్ శ్రీరాముడు లంకపై యుద్ధం చేసి గెలిచాడ‌ని, అనంత‌రం ఆ ప్రాంతాన్ని విభిషణుడికి ఇచ్చాడని అన్నారు. భార‌త్ గ‌తంలో బంగ్లాదేశ్‌ విషయంలోనూ అదే చేసింద‌ని గుర్తుచేస్తారు. అందువల్ల భారత్ ఇన్నాళ్లూ పాటిస్తూ వ‌చ్చిన శాంతిని మ‌న‌ బలహీనతగా పాకిస్థాన్‌ భావించకూడాదని పారికర్ అన్నారు. 
 
భారత్‌కు హాని చేయాల‌ని చూస్తే వారికి తగిన బుద్ధి చెప్పితీరుతామ‌ని అన్నారు. తాము ఏ దేశంపై కూడా దాడి చేసి విధ్వంసం సృష్టించాల‌ని కోరుకోవ‌డం లేద‌ని అన్నారు. ఎవరికీ హాని తలపెట్టాలని కోరుకోని తాము ఎవరైనా హాని చేస్తే మాత్రం దీటైన జ‌వాబే ఇస్తామ‌ని పారికర్ హెచ్చరించారు. మన సైన్యం జరిపిన దాడులతో పాకిస్థాన్ సర్కారు కోమాలోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు.