బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (16:00 IST)

ఫ్లైట్‌లో 330 ప్రయాణికులు... విమానంలో గుర్రుపెట్టి నిద్రపోయిన పైలట్...

ప్రైవేట్ విమానయాన సంస్థల్లో పని చేసే పైలట్లతో పాటు.. ఇతర సిబ్బంది తమ విధుల్లో అశ్రద్ధగా ఉంటారు. దీంతో అనేక విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా విమానంలో 330 మంది ప్రయాణికులుంటే ఆ పైలట్ మాత్రం గు

ప్రైవేట్ విమానయాన సంస్థల్లో పని చేసే పైలట్లతో పాటు.. ఇతర సిబ్బంది తమ విధుల్లో అశ్రద్ధగా ఉంటారు. దీంతో అనేక విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా విమానంలో 330 మంది ప్రయాణికులుంటే ఆ పైలట్ మాత్రం గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఇంతకీ ఆ విమానంలోని ప్రయాణికులు ఏమయ్యారో ఓసారి పరిశీలిద్ధాం. 
 
జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఓ విమానం ఇటీవల జర్మనీ గగనతలంలో దారితప్పింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు నివేదిక తయారు చేశారు. విచారణలో తేలిందేంటంటే... 330 ప్రయాణికులున్న ఈ విమానంలో ఓ పైలెట్ గుర్రుపెట్టి నిద్రపోయాడు. మరో పైలట్ తన హెడ్‌సెట్‌ను తక్కువ ఫ్రీక్వెన్సీలో పెట్టుకోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి సూచనలు సరిగా అందుకోలేకపోయినట్టు తేల్చారు. 
 
అదేసమయంలో ముంబై నుంచి లండన్ వెళుతున్న 9డబ్ల్యూ 118 విమానానికి సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఆ విమానం కంటే ముందు ప్రయాణిస్తున్న ఢిల్లీ-లండన్ విమానం (9డబ్ల్యూ 122) ద్వారా అధికారులు ఆ విమానానికి మార్గనిర్దేశం చేశారు. జెర్మనీ ఏటీసీ నుంచి సమాచారం అందుకున్న ఢిల్లీ విమానం సిబ్బంది 118 విమానం నడుపుతున్న పైలెట్లను శాటిలైట్ ఫోన్ ద్వారా సంప్రదించారు. 
 
ఆ తర్వాత కొద్ది సేపటికి 118 సిబ్బంది ముంబై ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరించుకోగలిగారు. దాదాపు 15 నిమిషాలకు గానీ పరిస్థితి చక్కబడలేదు. మొత్తం మీద 303 మంది ప్రయాణికులు, 15 మంది విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడినందుకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పైలెట్‌పై శాఖాపరమైన చర్యలకు దర్యాప్తు అధికారులు ఆదేశించారు.