సంబంధిత వార్తలు
- డీలిమిటేషన్ బిల్లు ముసుగులో రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర : రాహుల్ గాంధీ
- డీలిమిటేషన్ మరో పొలిటికల్ డీమానిటైజేషన్ : శశిథరూర్
- అమరావతికి ప్రత్యేక లోక్‌సభ సీటుపై చర్చ.. సీట్ల సంఖ్య 25 నుంచి 38కి పెంపు?
- మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉంది: పవన్ కల్యాణ్
- పార్లమెంట్ ముందుకు మూడు కీలక బిల్లులు - విపక్షాలు వ్యతిరేకత - 17న చర్చ
ప్రధాని మోడీకి నాకు భార్యలు లేరు... సో మాకు సమస్య లేదు : రాహుల్ గాంధీ
మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు తనకు భార్యలు లేరన్నారు. అందువల్ల మహిళా ఉమెన్స్ బిల్లుతో మా గృహాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోవన్నారు.
అంతేకాకుండా, గత రెండు దశాబ్దాలుగా తాను చేయలేని పనిని తన సోదరి ప్రియాంకా గాంధీ ఐదు నిమిషాల్లో చేసి చూపించారని, గురువారం సభలో ఆమె ప్రసంగం ఆలకించిన తర్వాత చాలా గర్వపడ్డానని, ముఖ్యంగా, ప్రియాంక తన ప్రసంగంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సభలో నివ్వించారని అన్నారు. దీంతో సభ్యులంతా మరోమారు నవ్వులు కురిపించారు.
ఈ సందర్భంగా నారీశక్తిపై రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో మహిళలు ముందుండి నడిపే శక్తిగా ఉంటారని కొనియాడారు. తన చిన్నతనంలో చీకటంటే భయపడినపుడు తన నాయనమ్మ జీవిత సత్యాలు నేర్పి ధైర్యం చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
డీలిమిటేషన్ బిల్లు ముసుగులో రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర : రాహుల్ గాంధీ
డీలిమిటేషన్ బిల్లు పేరుతో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లుతో పాటు మరో రెండు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ఇందులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇప్పటికే (2023లోనే) మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, దానినే అమలు చేయాలని కోరారు.
ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లు మహిళల సాధికారత కోసం పెట్టింది కాదని విమర్శించారు. ఈ బిల్లు ముసుగులో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అంతగా కావాలంటే పాత మహిళా రిజర్వేషన్ల బిల్లును రద్దు చేసి.. ఇప్పుడు కొత్తగా మళ్లీ తీసుకురావాలని కేంద్రానికి సూచించారు.
'మహిళా బిల్లు ముసుగులో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. అంతగా కావాలంటే పాత బిల్లును రద్దు చేసి.. మళ్లీ తీసుకురండి. మేం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా మద్దతిస్తాం. బీసీ, దళితులు, మైనార్టీలు, మహిళల పట్ల ఈ బిల్లు క్షమించరాని, క్రూరమైన చర్య. ఓబీసీ సోదరుల నుంచి అధికారం లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. కులగణన ప్రారంభమైందని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇప్పుడు కులగణనతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ ఎందుకు జరుగుతోంది? విపక్షాలన్నీ దీన్ని ఓడిస్తాయి' అని రాహుల్ గాంధీ అన్నారు.
'న్యాయవ్యవస్థ, ప్రైవేటు రంగం వంటి కీలక రంగాల్లో ఓబీసీలు, దళితులు ఎక్కడున్నారు? దేశ అత్యున్నత బ్యూరోక్రసీలో వీరు ఎక్కడున్నారు? ఓబీసీలకు అధికారం, భాగస్వామ్యం ఇచ్చేందుకు భాజపా సిద్ధంగా లేదు. తన ప్రాబల్యం తగ్గిపోతోందన్న భయం ఆ పార్టీకి పట్టుకుంది. దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలను భాజపా గౌరవించడం లేదు' అని రాహుల్ ధ్వజమెత్తారు.
