1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. PM Modi's WFH Appeal Sparks Debate: Is Corporate India Ready Again

#WorkFromHome దిశగా కేంద్రం అడుగులు... ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

work from home
దేశం మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న చమురు సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా, వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా సూచించారు. ఈ పిలుపు ఐటీ కంపెనీల్లో కొత్త చర్చకుదారితీసింది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రోత్సహించాయి. ఇపుడు ప్రధాని మోడీ పిలుపుతో మళ్లీ ఈ విధానం దిశగా అడుగులు వేయాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్, ఐటీ ఉద్యోగ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రధాని సూచనపై నాస్కామ్ స్పందిస్తూ, ఐటీ కంపెనీలు ఇప్పటికే హైబ్రిడ్ పని విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాయని గుర్తు చేసింది. ఉద్యోగి బాధ్యతలు, క్లయింట్ అవసరాలను బట్టి కంపెనీలే ఈ నిర్ణయాలు తీసుకుంటాయని పేర్కొంది. కేవలం వర్క్ ఫ్రమ్ హోం మాత్రమే కాకుండా ఐటీ కార్యాలయాల్లో విద్యుత్ వాడకాన్ని కూడా తగ్గించడం వంటి ఇతర పొదుపు చర్యలు కూడా చేపడుతున్నాయని వివరించింది. 
 
మరోవైపు, ఐటీ ఉద్యోగ సంఘం నైట్స్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోంను తప్పనిసరి చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనివల్ల ఇంధన ఆదాతో పాటు ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొంది. కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసుకున్న రిమోట్ వర్క్ మౌలిక సదుపాయాలను తిరిగి ఉపయోగించుకోవాలని సూచించింది. 
 
కాగా, కోవిడ్ సమయంలో దాదాపు మూడేళ్లపాటు వర్క్ ఫ్రమ్ హోం, హైబ్రిడ్ విధానంలో పనిచేసిన ఐటీ ఉద్యోగులను గత యేడాది నుంచి కంపెనీలు ఆఫీసులకు రావాలని ఒత్తిడి చేస్తున్న విషయం తెల్సిందే. తాజా పరిణామాలతో కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం వైపు మొగ్గు చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సీఎం విజయ్ సంచలన నిర్ణయం : ఆ టాస్మాక్ దుకాణాల మూసివేతకు ఆదేశం